Breaking News
Home / National / ఢిల్లీ అల్లర్లపై చర్చకు నోటీసులు ఇచ్చిన 9 పార్టీలు…

ఢిల్లీ అల్లర్లపై చర్చకు నోటీసులు ఇచ్చిన 9 పార్టీలు…

న్యూఢిల్లీ: దేశ రాజధానిని అట్టుడికించి 47 మంది మృతికి దారితీసిన అల్లర్లపై కేంద్రాన్ని పార్లమెంటులో మరింత ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు పావులు కదుపుతున్నాయి. ఢిల్లీ అల్లర్లపై ఉభయసభల్లోనూ చర్చ జరపాలంటు 9 విపక్ష పార్టీలు మంగళవారంనాడు నోటీసులు ఇచ్చాయి. కాంగ్రెస్, ఐయూఎంఎల్, బీఎస్‌పీ, ఎస్పీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం, టీఎంసీలు చర్చకు డిమాండ్ చేస్తున్నాయి. అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని విపక్షాల ప్రధాన డిమాండ్‌గా ఉంది.

స్వల్ప విరామానంతరం పార్లమెంటు సమావేశాలు సోమవారంనాడు ప్రారంభం కాగానే ఉభయ సభల్లోనూ అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడం, గందరగోళ పరిస్థితుల మధ్య ఎలాంటి చర్చా కార్యక్రమం లేకుండా సభ వాయిదా పడిన నేపథ్యంలో రెండవ రోజైన మంగళవారంనాడు విపక్షాలు వరుస నోటీసులతో కేంద్రాన్ని అష్టదిగ్బంధంలో పెట్టేందుకు సమాయత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించింది. కాగా, సజావుగా సమావేశాలు సాగేందుకు నిర్వహించేందుకు వీలుగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *