Breaking News
Home / National / చెరుకుతోటలో భారీ కొండచిలువ…

చెరుకుతోటలో భారీ కొండచిలువ…

ఉత్తర్ ప్రదేశ్‌: ఈ మధ్య పాములు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి. భయంకర విషసర్పాలు ఇళ్లలోకి, జనావాసాల్లోకి దూరిపోతున్నాయి. తాజాగా ఓ పెద్ద కొండచిలువ చెరుకుతోటలోకి చొచ్చుకొని వచ్చింది. దాదాపు ఆ కొండ చిలువ పొడవు 15 అడుగులు. దీంతో కొండచిలువను చూసిన జనం భయంతో పరుగులు తీశారు. మరికొందరు ధైర్యం చేసి దాన్ని పట్టుకున్నారు. తర్వాత అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. అనంతరం అటవీశాఖ అధికారులు ఆ కొండచిలువను తీసుకెళ్లి అడవుల్లో వదిలేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *