Breaking News
Home / Crime / 16 ఏళ్ల బాలికను గదిలో పెట్టి…?

16 ఏళ్ల బాలికను గదిలో పెట్టి…?

ముంబై : పదహారేళ్ల బాలికను గదిలో పెట్టి తాళం వేసి వెళితే, షార్టుసర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరగడంతో కాలిపోయి మరణించిన విషాద ఘటన ముంబై నగరంలో జరిగింది. శ్రావణి చవాన్ (16) ముంబై నగరంలోని దాదర్ సబర్బన్ పోలీసుస్టేషను ఆవరణలోని అపార్టుమెంటులో నివాసం ఉండేది. శ్రావణి చవాన్ తండ్రి వకోలా పోలీసుస్టేషనులో పోలీసు నాయక్ గా పనిచేస్తున్నారు. శ్రావణి తల్లిదండ్రులే ఆమెను చదువుకోమని చెప్పి, గదిలో ఉంచి ఇంటికి తాళం వేసి పెళ్లికి వెళ్లారు. తల్లిదండ్రులు పెళ్లి నుంచి ఇంటికి తిరిగి వచ్చేలోపే అపార్టుమెంటులో షార్టుసర్క్యూట్ అయి అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం జరిగినా బాలిక మంటల్లో కాలిపోతూ హాహా కారాలు చేసినా అవి బయటి వారికి వినిపించలేదు. దీనికితోడు ఇంటికి తాళం వేసి ఉండటంతో లోపల ఎవరూ లేరని భావించారు. తల్లిదండ్రులు తిరిగివచ్చాక తీవ్రంగా గాయాలపాలైన శ్రావణిని సియాన్ లోని ఆసుపత్రికి తరలిస్తే, ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు చెప్పారు. ఈ ఘటన అందరినీ కలచివేసింది.

Check Also

ఢిల్లీ మాజీ సిఎం అంత్యక్రియల ఖర్చు ఎంతో తెలుసా?

Share this on WhatsAppన్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం నిగంబాధ్‌ ఘాట్‌లో జరిగాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *