Breaking News
Home / Film News / అరుదైన రికార్డు సాధించిన బ్యాట్స్‌మన్‌

అరుదైన రికార్డు సాధించిన బ్యాట్స్‌మన్‌

అడిలైడ్‌: పాకిస్థాన్‌తో జరుగుతున్న డే/నైట్‌ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 7వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 126 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాళ్లు సచిన్‌, సెహ్వాగ్‌ను స్మిత్‌ అధిగమించాడు. స్మిత్‌ తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్‌ ఆటగాడు వాల్టర్ (131 ఇన్నింగ్స్‌లు), సెహ్వాగ్‌ (134 ఇన్నింగ్స్‌లు), సచిన్‌ (136 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు. భారత సారథి విరాట్‌ కోహ్లీ, శ్రీలంక మాజీ క్రికెటర్‌ సంగక్కర, వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ గ్యారీ 138 ఇన్నింగ్స్‌ల్లో 7వేల పరుగులు సాధించారు. టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం స్మిత్‌ అగ్రస్థానంలో ఉండగా కోహ్లీ ద్వితీయ స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య కేవలం మూడు రేటింగ్‌ పాయింట్ల అంతరమే ఉంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *