Breaking News
Home / National / సోషల్ మీడియాలో వైరల్ గా మారిన యాచకుడు కధ

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన యాచకుడు కధ

పూరి జగన్నాథ దేవాలయం వద్ద జరిగింది. పూరి జగన్నాథ దేవాలయం వద్ద కాషాయ వస్త్రాలు ధరించిన ఓ వ్యక్తికి రిక్షనడిపే వ్యక్తికీ మధ్య గొడవ జరిగింది.

ఈ గొడవకు దారి తీసిన అంశాలు ఏవైనప్పటికీ, ఈ గొడవ మాత్రం పెరిగి పెద్దదై పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. వెంటనే పోలీసులు సదరు వ్యక్తిని ప్రశ్నించారు. జరిగిన విషయాన్ని లిఖితపూర్వకంగా రాయమని ఇచ్చారు. వెంటనే కాషాయ వస్త్రాలు ధరించిన ఆ వ్యక్తి జరిగిన విషయాన్ని పేపర్ పై రాసి ఇచ్చారు. ఆ లెటర్ చూసి పోలీసులు ఖంగు తిన్నారు. స్పష్టమైన ఇంగ్లీష్ లో ఉన్నది లెటర్. షాకైన పోలీసులు అతని గురించి ఆరాతీయడం మొదలు పెట్టారు.

అతను కొన్నాళ్ల క్రితం వరకు మిల్టన్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేసిన గిరిజా శంకర్ మిశ్రాగా గురించి. అతని తండ్రి ఓ పోలీస్ ఆఫీసర్. కొన్నాళ్ల క్రితం మరణించారు. తల్లి కూడా మరణించింది. అన్నదమ్ములు, అక్క చెల్లెల్లు ఉన్నత స్థాయిలో ఉన్నారు. అయితే, అతనికి మతి చెలించడంతో ఉద్యోగం మానేసి కాషాయం ధరించి ఇలా దేశంలో తిరుగుతున్నారు. ప్రసిద్ధ దేవాలయాల వద్ద యాచకుడిగా జీవనం సాగిస్తున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *