Breaking News
Home / States / Andhra Pradesh / నగరంలో బీభత్సం సృష్టించిన కారు…

నగరంలో బీభత్సం సృష్టించిన కారు…

విజయవాడ: నగరంలోని సీతారాంపురం లాల్ బహుదూర్ శాస్త్రి వీధిలో అతివేగంగా వచ్చిన XUV500 నెంబరు గల కారు సోమవారం తెల్లవారుజామున బీభత్సం సృష్టించి షాపులోకి దూసుకుపోయింది. గూడ్స్ ఆటోలు, బైకులు ధ్వంసమయ్యాయి. ఉదయం కావడం, జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *