హైదరాబాద్: బతుకమ్మపై 316 మంది కవయిత్రులు కవితలు వినిపించనున్నారు. రవీంద్రభారతి వేదికగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కాసేపట్లో కవితాగానం ప్రారంభమౌతుంది. భారతీయ సాహితీ రంగంలోనే తొలిసారి 316 మంది కవయిత్రులు బతుకమ్మపై కవితా సంకలనం ఆవిష్కరించనున్నారు. దీంతో తెలంగాణ బతుకమ్మ అరుదైన రికార్డుకు వేదిక కానున్నది. కవయిత్రులంతా తెలంగాణతో పాటు వివిధ దేశాలు, రాష్ర్టాల నుంచి హాజరవుతున్నారు. రవీంద్రభారతిలోని ప్రధాన వేదిక సహా 3 హాళ్లలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు కవితాగానం కొనసాగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి సాహితీ అభిమానులకు స్వాగతం పలుకుతోంది.
