హైదరాబాద్ : లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్ వద్ద ఘనంగా గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు తదితరులు గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని, నగర మేయర్ రామ్మోహన్ తదితరులు హాజరయ్యారు.
