Breaking News
Home / World News / అప్పుడే తీరం దాటిన తుపాను.. కుప్పకూలిన భారీ వంతెన

అప్పుడే తీరం దాటిన తుపాను.. కుప్పకూలిన భారీ వంతెన

తైవాన్: అప్పుడే తీరం దాటిన తుపాను కారణంగా బలహీనపడిన ఓ భారీ వంతెన అందరూ చూస్తుండగానే క్షణాల్లో కుప్పకూలింది. తైవాన్‌లోని నాన్ఫాంగోలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రిడ్జి ఉన్నట్టుండి కూలడంతో దానిపై ప్రయాణిస్తున్న వాహనాలు కింద ఉన్న నదిలో పడ్డాయి. ఈ ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది గాయపడగా, కిందపడిన వాహనాల్లోని ప్రయాణికులు నీటిలో మునిగి గల్లంతయ్యారు. వంతెనపై నుంచి ఆయిల్ ట్యాంకర్ వెళ్తున్న సమయంలో బ్రిడ్జి ఒక్కసారిగా మధ్యకు విరిగి రెండు ముక్కలై నీటిలో కూలింది. కింద ఉన్న ఫిషింగ్‌బోటుపై ఆయిల్ ట్యాంకర్ పడడంతో మంటలు చెలరేగాయి. బ్రిడ్జి కూలిన సమయంలో నదిలో బోట్లు ఉండడంతో పెను ప్రమాదమే జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు హెలికాప్టర్లు, సహాయక సిబ్బందిని రంగంలోకి దించారు. నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు మొదలుపెట్టారు. అలాగే, 60 మంది మిలటరీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బ్రిడ్జి శిథిలాలను తొలగిస్తున్నారు.

వంతెన కూలడానికి ముందు తుపాను తీరం దాటిందని, ఆ సమయంలో వీచిన బలమైన గాలులకు బ్రిడ్జి బలహీన పడి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అదే సమయంలో వంతెన పైనుంచి భారీ వాహనాలు ప్రయాణించడంతో ఒత్తిడి పెరిగి కూలి ఉంటుందని పేర్కొన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

460 అడుగుల పొడవు, 60 అడుగుల ఎత్తున్న ఈ బ్రిడ్జిని 1998లో ప్రారంభించారు. ఈ బ్రిడ్జికి ముందు బాగా కిందికి ఉన్న వంతెన ఉండేది. అయితే, పెద్ద పెద్ద ఫిషింగ్ బోట్లను అది అడ్డుకుంటుండడంతో దాని కూల్చి దీనిని నిర్మించారు. బ్రిడ్జి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకే ఆర్క్ ఉండడం దీనిని ప్రత్యేకత. ఇలా సింగిల్ ఆర్క్ కలిగిన వంతెనలలో ప్రపంచంలోనే ఇది రెండోది.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *