Breaking News
Home / States / శ్రీశైలానికి భారీగా పెరుగుతున్న వరద…

శ్రీశైలానికి భారీగా పెరుగుతున్న వరద…

సున్నిపెంట సర్కిల్‌: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న రాత్రి నాలుగు గేట్లు ఎత్తిన అధికారులు తాజాగా బుధవారం ఉదయం మరో ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. స్పిల్‌ వే ద్వారా మొత్తం పది గేట్లను పది అడుగుల మేరపైకి ఎత్తారు. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 4.60 లక్షల క్యూసెక్కులు కాగా స్పిల్‌వే ద్వారా 2.79 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ప్రవాహం స్థిరంగా ఉండటంతో కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 78వేల క్యూసెక్కులు సాగర్‌కు విడుదలవుతున్నాయి. శ్రీశైలంలో ప్రస్తుత నీటి మట్టం దాదాపు 885 అడుగులు. నీటి నిల్వ 215 టీసీఎంలుగా ఉంది. ఈ సీజన్‌లో శ్రీశైలం జలాశయం గేట్లను ఎత్తడం ఇది ఏడోసారి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *