న్యూఢిల్లీ: పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్‌ను ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్, స్పెషల్ టాస్కఫోర్స్ (ఎస్టీఎఫ్) క్రైంబ్రాంచి బృందాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి పట్టుకున్నారు. ఇవాళ తెల్లవారు జామున జరిగిన ఓ ఎన్కౌంటర్ అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. నోయిడాలో రూ.65 లక్షల దోపిడీ కేసు సహా 25 కేసుల్లో ఇక్బాల్ నిందితుడిగా ఉన్నాడు. మహ్మద్ పాండే మెహ్రూన్ ముల్లా గ్యాంగ్‌లో అతడు షార్ప్‌షూటర్ అని తేలింది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతడు కాల్పులు జరిపాడనీ పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడనీ అధికారులు వెల్లడించారు. దాదాపు 10 రౌండ్ల పాటు కాల్పులు జరిగినట్టు చెబుతున్నారు.
ద్వారకలో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ఢిల్లీ పోలీసులు మరో గ్యాంగ్‌స్టర్‌ని పట్టుకున్నారు. తెవాతియా గ్యాంగ్‌ను నడిపిస్తున్న ప్రిన్స్ తెవాతియా, పెరోల్పసై బయటికి వచ్చి పోలీసులు కళ్లుకప్పి తిరుగుతున్నాడు. ఇతడిపై డజనుకు పైగా హత్య కేసులు ఉన్నాయి.