Breaking News
Home / National / స్కూల్ బస్సుపై కూలిన భారీ వృక్షం…

స్కూల్ బస్సుపై కూలిన భారీ వృక్షం…

బెంగుళూరు : స్కూల్‌ నుంచి విద్యార్థులతో వెళుతున్న బస్సుపై ఒక్క సారిగా ఓ భారీవృక్షం కూలింది. అయితే డ్రైవర్‌ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది. వర్తూరు సమీపంలోని ది ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ బెంగళూరు పాఠశాలకు చెందిన వాహనం విద్యార్థులతో బయల్దేరింది. వర్తూరు నుంచి వర్తూరు కోడి, రామగొం డనహళ్ళి వైపు వెళుతూ సర్జాపుర-హొసకోటె రోడ్డుకు చేరుకుంది. వినాయక థియేటర్‌ సమీపానికి వాహనం రాగానే ఓ భారీ వృక్షం ఒక్కసారిగా కుప్ప కూలింది. దీంతో బస్సు ముందు భాగం దెబ్బ తింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. బస్సులో 36మంది పిల్లలు ఉన్నా రు.

డ్రైవర్‌కు స్పల్పగాయ్యాయి. స్థానిక నివాసి వెంకటేశ్‌ తక్షణం స్పందించి డ్రైవర్‌ పక్కన ఉన్న కిటికీ నుంచి పిల్లలను కిందకు దించేశారు. అదే పాఠశాలకు చెందిన మరొక బస్సులో విద్యార్థులందరినీ సురక్షితంగా ఇంటికి చేర్చారు. ఘటన కారణంగా సుమారు 4కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బస్సుపై పడ్డ భారీ వృక్షాన్నా క్రేన్‌ల సాయంతో తొలగించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *