Breaking News
Home / Crime / భార్య, కుమారుడిని హతమార్చిన భర్త

భార్య, కుమారుడిని హతమార్చిన భర్త

హైదరాబాద్‌: గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. గోపన్‌పల్లి ఎన్టీఆర్‌ నగర్‌లో భార్య, కుమారుడిని భర్త అనంతప్ప హతమార్చాడు. అనంతప్ప.. హనుమాన్‌ భక్తుడు, భార్య అమ్మవారి భక్తురాలుగా ఉన్నారు. భార్య మహాదేవమ్మతో పూజలు చేసే విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన అనంతప్ప.. భార్యకు ఉరి వేసి.. 18 నెలల కొడుకుని ఊపిరాడకుండా చేసి అంతమొందించాడు. అనంతరం నిందితుడు కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

మేడం.. నా పెళ్లి ఆపండి.. చదువుకుంటా.. షీ టీమ్‌కు బాలిక ఫోన్

Share this on WhatsAppతనకు ఇప్పుడే పెళ్లి వద్దని.. ఇంట్లో చెప్పినా వినకుండా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని.. ఓ బాలిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *