Breaking News
Home / States / తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో కీలక మలుపు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో కీలక మలుపు

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఓయూ విద్యార్థి జేఏసీ తాజాగా టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించింది. సోమవారం నుంచి నిరసనలకు దిగాలని నిర్ణయించింది. ఈనెల 14న మంత్రుల కార్యాలయాలను ముట్టడిస్తామని ప్రకటించింది. అలాగే 16న ఓయూలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఓయూ విద్యార్థి జేఏసీ పేర్కొంది. 19న విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. 21న ప్రగతి భవన్ ముట్టడిస్తామని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రెవెన్యూ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతం కానుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *