వాయిదాలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడికి రిమాండ్
హైదరాబాద్: స్థలం నకిలీ పత్రాలతో బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నాడు. వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. మహమ్మద్ ఇమ్రాన్ చార్మినార్, ఖిల్వత్ ప్రాంతంలో అలిస్సా గార్మెంట్ షాపు నిర్వహిస్తున్నాడు. బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడానికి స్నేహితుడితో కలిసి పథకం వేశాడు. ఓ స్థలానికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి వాటిని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముషీరాబాద్ శాఖలో తనఖీ పెట్టి రూ. 70లక్షల రుణం తీసుకున్నాడు. వాయిదాలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. బ్యాంక్ చీఫ్ మేనేజర్ గత ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీన సీసీఎ్సలో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.
