గుంటూరు: గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరులో మిరప నారును పెంచే ప్లాంట్ను నిర్వహిస్తున్న కొమ్మినేని రత్తయ్యను అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతుడు తాడికొండ మండలం బండారుపల్లి వాసి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
