Breaking News
Home / States / Andhra Pradesh / ఆలస్యంగా వెలుగు చూసిన వ్యక్తి ఆత్మహత్య

ఆలస్యంగా వెలుగు చూసిన వ్యక్తి ఆత్మహత్య

విజయనగరం : గరివిడి మండలం గొట్నంది గ్రామంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది. ఈ రోజు ఉదయం గొట్నంది గ్రామంలోని నాగేశ్వరరావు ఇంట్లో నుండి దుర్వాసన వస్తుండటంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించిన పోలీసులు నాగేశ్వరరావు మృతదేహాన్ని గుర్తించారు. ఈ నెల ఒకటో తేదీ రాత్రి బండారు నాగేశ్వరరావు (50) ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానాన్ని వ్యక్తపరిచారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం చీపురుపల్లిలోని మార్చురీకి తరలించారు. మృతుడుకి భార్య, పిల్లలు దూరంగా ఉంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *