Breaking News
Home / States / Andhra Pradesh / షార్ట్‌ సర్క్యూట్‌కు బలైన తల్లీకొడుకులు….

షార్ట్‌ సర్క్యూట్‌కు బలైన తల్లీకొడుకులు….

చిత్తూరు : బుధవారం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గానుగపెంట పంచాయతీ కూనపల్లి గ్రామంలోని శేఖర్‌ అనే వ్యక్తి ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి తల్లి శంకరమ్మ (75), కొడుకు శేఖర్‌ (50) లు ఇద్దరూ సజీవదహనమయ్యారు. ఇంట్లో నిద్రిస్తుండగా మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో యుపిఎస్‌ బ్యాటరీ పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *