Breaking News
Home / States / Andhra Pradesh / మీ సేవ నిర్వాహకునిపై దాడి….

మీ సేవ నిర్వాహకునిపై దాడి….

నెల్లూరు : నెల్లూరు జిల్లా కొండాపురం మండల కేంద్రంలో కొన్ని సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మీ సేవ ఆధార్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. కొండాపురం మండలం భీమవరప్పాడు గ్రామానికి చెందిన విడవలపాటి మాల్యాద్రి అనే వైసీపీకి చెందిన వ్యక్తి కొన్ని రోజులుగా గ్రామంలోని దాదాపు 10 మంది ఆధార్‌ కార్డులలోని వయస్సును మార్చాలంటూ ప్రతి రోజు ఆధార్‌ కేంద్రానికి వస్తున్నాడు. అలా చేయటం వీలుపడదని సదరు మీ సేవ నిర్వాహకుడు చెప్పినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన మాల్యాద్రి శుక్రవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో తన 20 మంది అనుచరులతో మీ సేవ నిర్వాకుడిపై దాడి చేసి గాయపరిచాడు. ప్రస్తుతం అతడు కావలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *