Breaking News
Home / National / పేలిన టైరుతో దుబాయ్ నుంచి జైపూర్‌కి విమానం…. విమానానికి పెను ప్రమాదం?

పేలిన టైరుతో దుబాయ్ నుంచి జైపూర్‌కి విమానం…. విమానానికి పెను ప్రమాదం?

న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి జైపూర్ వస్తున్న ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. స్పైస్ జెట్‌కి చెందిన ఎస్‌జీ-58 విమానం టైరు పేలిపోయినప్పటికీ ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 189 మంది ప్రయాణికులు ఉన్నారు. ‘‘జైపూర్‌లో విమానం ల్యాండ్ అవుతుందగనగా పైలట్లు జైపూర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సమాచారం అందించారు. ఏటీసీ సూచనలను పాటిస్తూ విమానాన్ని క్షేమంగా దించారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా కిందికి దిగారు. విమానానికి కూడా ఏమీ కాలేదు…’’ అని స్పైస్ జెట్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. టైరు దుబాయ్ నుంచి బయల్దేరినప్పుడే పేలి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ విమానాన్ని అధికారులు పరీక్షిస్తున్నారు.

Check Also

పారిస్‌లో మోదీకి ఘనస్వాగతం

Share this on WhatsAppపారిస్: ఫ్రాన్స్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పారిస్‌లోని చార్లెస్ డె గౌలె ఎయిర్‌పోర్ట్‌లో ఘన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *