Breaking News
Home / National / శ్రీలంక మాజీ కెప్టెన్ కు అరుదైన గౌరవం….

శ్రీలంక మాజీ కెప్టెన్ కు అరుదైన గౌరవం….

న్యూఢిల్లీ: శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కరకు అరుదైన గౌరవం దక్కింది. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ)కు సంగక్కర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో 232 సంవత్సరాల చరిత్ర కలిగిన మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి బ్రిటీషేతర వ్యక్తిగా సంగక్కర రికార్డు సృష్టించారు. ఎంసీసీకి అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… అధ్యక్ష పదవి చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎంసీసీ నిర్వహించే పనులపై స్థానికంగా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అవగాహన కల్పిస్తానని చెప్పారు. క్రికెట్‌కు మద్దతిచ్చే వారి సంఖ్య పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *