హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు ఎక్కడికక్కడ స్తంభించడంతో మెట్రో రైలును ఆశ్రయించి ప్రయాణికులు నేడు మరింత ఇబ్బందికి గురయ్యారు. పారడైస్ సమీపంలోని స్టేషన్ వద్ద సాంకేతిక సమస్యతో ట్రాక్‌పై మెట్రో రైలు అరగంటపాటు నిలిచిపోయింది. మరమ్మతు చేసినప్పటికీ కదలకపోవడంతో అధికారులు వేరే ట్రైన్‌ని రప్పించి ఈ ట్రైన్‌కి జాయింట్ చేసి అమీర్‌పేట్ మెట్రో జంక్షన్ వరకు తీసుకు వెళ్లారు.
