Breaking News
Home / Crime / కడుపునొప్పితో వస్తే ప్రాణమే పోయింది

కడుపునొప్పితో వస్తే ప్రాణమే పోయింది

అపెండిసైటిస్‌ సర్జరీలో ఘోర తప్పిదం
పేగు కత్తిరించడంతో ఆగని రక్తస్రావం
ఆపరేషన్‌ టేబుల్‌పైనే మహిళ మృతి
గుంటూరు జీజీహెచ్‌లో దారుణం
గుంటూరు: కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ… వైద్యుల తప్పిదంతో ఏకంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని సర్జరీ యూనిట్‌లో జరిగింది. పాత గుంటూరు రాజీవ్‌ గృహకల్పకు చెందిన పావనీ బాయ్‌(22)కి ఐదేళ్ల క్రితం కృష్ణాజిల్లా కొత్తూరు తాడేపల్లికి చెందిన సాంబయ్య నాయక్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రెండు వారాల క్రితం పుట్టింటికి వచ్చిన ఆమెకు సోమవారం కడుపులో నొప్పి రావడంతో సాయంత్రం జీజీహెచ్‌ అత్యవసర చికిత్సల విభాగానికి తీసుకొచ్చారు. పరీక్షించిన సిబ్బంది అపెండిసైటి్‌స(24గంటల కడుపునొప్పి)గా నిర్ధారించారు. మంగళవారం ఉదయం 8గంటలకు సర్జరీ నిమిత్తం ఆమెను థియేటర్‌లోకి తీసుకెళ్లారు. గంట తరువాత హడావిడిగా బయటకొచ్చి ఆమె బాబాయి కొండలును లోపలకు తీసుకెళ్లారు. కడుపులో కొన్ని కొత్త గడ్డలున్నాయని, వాటిని తీస్తే ప్రాణాపాయమని చెప్పారు. ఆయన వాటిని తొలగించాలని కోరడంతో పావనిని మరో థియేటర్‌కు మార్చారు. చివరకు 11గంటల సమయంలో గడ్డ తొలగిస్తుండగా ఆమె చనిపోయినట్లు సమాచారం ఇచ్చారు. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ బంధువులు, ప్రజాసంఘాల నాయకులు సూపరింటెండెంట్‌ చాంబర్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు… అపెండిసైటిస్‌ సర్జరీ సమయంలో పేగు కుడివైపు మూల మీద పెరిగిన భాగాన్ని కత్తిరించబోయిన వైద్యుడు పేగును పూర్తిగా కత్తిరించాడు. వెంటనే రక్తస్రావాన్ని అదుపు చేయడంలో వైద్యులు విఫలమయ్యారు. అప్పుడు మత్తు వైద్యుడు కూడా చేసిన పొరపాటుతో పావని టేబుల్‌పైనే చనిపోయినట్లు సమాచారం.

Check Also

కళ్లు మూసుకుపోయిన కామాంధుడు.. ఆవుపై అఘాయిత్యం

Share this on WhatsAppకామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పశువులు కూడా సిగ్గుపడేలా వ్యవహరించాడు. మూగజీవి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *