Breaking News
Home / States / హైదరాబాద్‌లో ఐదు రోజుల్లో రూ.వెయ్యి కోట్ల మద్యం..

హైదరాబాద్‌లో ఐదు రోజుల్లో రూ.వెయ్యి కోట్ల మద్యం..

తెలంగాణలో రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. అందులోనూ హైదరాబాద్ నగరంలో విపరీతంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధిస్తారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో మద్యం ప్రియులు మద్యం దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. అదేంటి.. లాక్‌డౌన్ విధిస్తారంటే.. మద్యం దుకాణాలకుపరుగులు తీయడం ఏమిటి అనుకుంటున్నారా.. మరేం లేదండి. లాక్‌డౌన్ విధిస్తే మద్యం దుకాణాలు మూతపడే అవకాశం ఉంది. ఫలితంగా మద్యం దొరక్క ఇబ్బందులు పడాల్సి వస్తుందని ముందు జాగ్రత్తగా మద్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే గత ఐదు ర్లోజుల్లోనే దాదాపు రూ.1000 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారంతో ఇప్పటికే హైదరాబాద్ నగరం సగం వరకు ఖాళీ అవుతోంది. ఇదిలా ఉంటే… కరోనా వైరస్ కారణంగా చితికిపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మద్యం అమ్మకాల ద్వారా కాస్తంత మెరుగుపడింది. రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ నుంచి వచ్చే ఆదాయం కంటే మద్యం విక్రయాల నుంచే అధికంగా ఆదాయం సమకూరుతోంది. గత ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా కేవలం మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.4997.81 కోట్ల ఆదాయం వచ్చింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *