Breaking News
Home / States / Andhra Pradesh / స్నానానికి వెళ్లి శవమై తేలిన యువకుడు….

స్నానానికి వెళ్లి శవమై తేలిన యువకుడు….

సరుబుజ్జిలి: లావేరు మండలం చిన్నమురపాక గ్రామానికి చెందిన కింతలి మణికంఠ (21) అనే యువకుడు నందికొండ కాలనీలో ఉండే తన మామయ్య ముచ్చేటి వెంకన్న ఇంటికి దసరా పండుగ కోసమని మంగళవారం రాత్రి వచ్చాడు. బుధవారం ఉదయం తోటి యువకులతో కలిసి మండలంలోని సరుబుజ్జిలి కూడలికి సమీపంలో ఉన్న వంశధార కుడి ప్రధాన కాల్వలో స్నానం చేసేందుకు వెళ్లగా ఈత కొడుతూ గల్లంతయ్యాడు. స్థానికులు మణికంఠ ఆచూకీ కోసం కాల్వలో వెతకగా గట్టు పక్కనే మణికంఠ శవమై కన్పించాడు. మృతుడి కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సమాచారాన్ని అందించారు. మృతుడు ఎచ్చెర్లలోని వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలలో పాలిటెక్నిక్‌ చదువుతున్నట్లు స్థానికులు తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *