Breaking News
Home / States / ఈఎస్‌ఐ డైరెక్టర్‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం…

ఈఎస్‌ఐ డైరెక్టర్‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం…

హైదరాబాద్‌: ఏసీబీ అధికారులు ఈఎస్‌ఐ కేసు విచారణ కొనసాగిస్తూ నిందితులను రెండో రోజు కస్టడీలోకి తీసుకుంది. ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికారాణితో పాటు మరో ఆరుగురిని విచారిస్తున్నారు. మొదటి రోజు మందుల కొనుగోళ్లు, ఫార్మా టెండర్లు, ఆస్తులపై ఆరా తీశారు. డైరెక్టర్‌ దేవికారాణిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మందుల కొనుగోళ్లలో జీవో 51 నియమాలు ఎందుకు పాటించలేదని ప్రశ్నించగా దేవికారాణి, పద్మ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే సాక్ష్యాలను ముందు పెట్టి అధికారులు ఆస్తుల వివరాలు, బ్యాంకు లావాదేవీలపై కూడా కూపీలాగారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *