Breaking News
Home / States / ఎల్బీనగర్‌-మియాపూర్‌ మెట్రోలో ప్రమాదం…

ఎల్బీనగర్‌-మియాపూర్‌ మెట్రోలో ప్రమాదం…

హైదరాబాద్‌ : ఎల్బీనగర్‌-మియాపూర్‌ మెట్రోలో శుక్రవారం స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. డోర్‌పైనున్న క్యాబిన్‌ ఊడి ప్రయాణికులపై పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కానప్పటికీ ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ వద్దకు చేరుకున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఇదిలా ఉండగా.. గత 14 రోజులుగా టీఎస్‌ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండటంతో హైదరాబాద్‌ మెట్రో సర్వీసులకు జనం తాకిడి ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు పట్టుకుని నుంచునే డోర్‌పైనున్న క్యాబిన్‌ ఊడిపోయినట్టు పలువురు చెప్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *