Breaking News
Home / States / Andhra Pradesh / ప్రమాదవశాత్తూ బావిలో పడి బాలుడు మృతి…

ప్రమాదవశాత్తూ బావిలో పడి బాలుడు మృతి…

కడప: ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బావిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన సోమవారం పాతకలమల్ల గ్రామంలో చోటు చేసుకుంది. పాతకలమల్ల గ్రామంలో ధ్రువ కుమార్‌ (4) ఈరోజు ఉదయం ఇంటి బయట ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు సమీపంలో ఉన్న బావిలో పడి మృతి చెందాడు. బాలుడి తండ్రి శ్రీనివాసులు ఉపాధి నిమిత్తం కువైట్‌ లో పని చేస్తున్నాడు. తల్లి వెంకట లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *