Breaking News
Home / States / Andhra Pradesh / ఏపీలో ఇక రెండేళ్ల పాటు అక్రిడిటేషన్‌ మంజూరు

ఏపీలో ఇక రెండేళ్ల పాటు అక్రిడిటేషన్‌ మంజూరు

20లోగా జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవాలి
కడప (కలెక్టరేట్‌): రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, ఫ్రీలాన్స్‌, వెటరన్‌ జర్నలిస్టులు 2020-21 సంవత్సరాలకు రెండేళ్ల పాటు అక్రిడిటేషన్‌ మంజూరు కోసం ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర పౌర సంబంధాల శాఖ కమిషనరు విజయకుమార్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారని పేర్కొన్నారు. సమాచార శాఖ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌  లో జర్నలిస్టులు తమ వివరాలను అప్‌లోడ్‌ చేసి ఆ ప్రింట్‌ డాక్యుమెంటు కాపీలను, జత పరచాల్సిన పత్రాలతో దరఖాస్తులను రాష్ట్రస్థాయిలో పనిచేస్తు న్న జర్నలిస్టులు కమిషనరు, ఫౌర సంబంధాలశాఖ కార్యాలయం, విజయవాడకు, జిల్లా స్థాయి జర్నలిస్టులు సంబంధిత జిల్లాలోని సమాచారశాఖ డిప్యూ టీ డైరెక్టరు, అసిస్టెంట్‌ డైరెక్టర్లకు సమర్పించాలన్నా రు. జర్నలిస్టులు సమర్పించిన డాక్యుమెంట్లు, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన పత్రాలు వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు సమాచార శాఖ ఏడీ ఆ ప్రక టనలో తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *