Breaking News
Home / States / Andhra Pradesh / జోలి పట్టి కార్యకర్తలను ఆదుకుంటాము….

జోలి పట్టి కార్యకర్తలను ఆదుకుంటాము….

శ్రీకాకుళం: టీడీపీ ఓటమిని ఎవరూ ఊహించలేదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తెలిపారు. స్వతంత్ర భారత దేశంలో వైసీపీ వంటి శాడిస్ట్ ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని.. గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నారు. అవసరమైతే జోలి పట్టి కార్యకర్తలను ఆదుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు. కేసులకు టీడీపీ కార్యకర్తలు భయపడరన్నారు. జగన్‌లా అవినీతి చేసి జైలుకు వెళ్తే సిగ్గుపడాలన్నారు. అక్రమ కేసులకు బదులు ఇచ్చి తీరుతామన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెడితే జిల్లాలో ఒక్క వైసీపీ నేత మిగిలేవాడా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *