Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / దిశ చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలి…

దిశ చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలి…

అమరావతి: దిశ చట్టం అమలుకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, ఏజీ శ్రీరామ్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. న్యాయపరంగా, పోలీసు పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. ”చట్టం చేసినా అమలుకావట్లేదన్న మాట ఎక్కడా రాకూడదు. దిశ చట్టం అమలుకు అన్ని చర్యలూ తీసుకోవాలి. 13 కోర్టులకు అవసరమైన బడ్జెట్‌ వెంటనే కేటాయించాలి” అని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి కోర్టుకు సుమారు రూ.2కోట్లు అవసరమవుతాయని ఈసందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం.. వారం రోజుల్లో డబ్బును డిపాజిట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *