Breaking News
Home / Entertainment / విడాకులు దాఖలు చేసిన నటుడి భార్య

విడాకులు దాఖలు చేసిన నటుడి భార్య

ముంబై: నటుడు రఘుబీర్‌ యాదవ్‌ మరో మహిళతో అక్రమ సంబంధం నడుపుతూ తనని మోసం చేశాడని ఆరోపిస్తూ ఆయన భార్య పూర్ణిమా ఖర్గా గత వారం విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కారు. కాగా రఘుబీర్‌ యాదవ్‌ బాలీవుడ్‌లో ‘లగాన్‌’, ‘సూయి ధాగా’, ‘న్యూటన్’, ‘పిప్లీ లైవ్‌’ చిత్రాల్లో ప్రముఖ పాత్రల్లో నటించారు. రఘుబీర్‌ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనని మోసం చేశాడని… అందుకే తన నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. యాదవ్‌ కొన్ని ఏళ్ల నుంచి సంజయ్‌ మిశ్రా భార్య రోషిణి అచ్రేజాతో సహజీవనం చేస్తున్నాడని ఇప్పుడు వారికి 14 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు తెలిపారు. అంతేగాక ‘రాజ్‌ భరోట్‌’ అనే టీవీ షోలో నటిస్తున్న క్రమంలో నటి నందిత దాస్‌తో యాదవ్‌ ప్రేమలో పడ్డాడని కూడా పేర్కొన్నారు. అప్పుటికే వారికి పెళ్లై ఏడు సంవత్సరాలు అయినట్లు చెప్పారు.

కాగా ఇటీవల విడాకులకు దరఖాస్తు చేసిన ఖార్గా ప్రస్తుతం రఘుబీర్‌ నుంచి విడిపోయి తన 30 ఏళ్ల కుమారుడితో కలిసి ఆయనకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. అయితే రోజువారి ఖర్చుల నిమిత్తం నెలకు మెయింటెనెన్స్‌ కింద రూ. 1లక్ష ఇవ్వాలని, విడాకుల అనంతరం భరణం కింద రూ.10 కోట్లు ఇవ్వాలని యాదవ్‌ను డిమాండ్‌ చేసినట్లు చెప్పారు. అదే విధంగా క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోర్టు కూడా నెలకు రూ. 40 వేల చొప్పున తనకు పంపించాలని యాదవ్‌ను ఆదేశించినట్లు చెప్పారు. అయితే యాదవ్‌ డబ్బులు చెల్లించకపోగా.. భరణం కూడా ఇవ్వకుండా ఉండేందుకు ఆస్తిని అచ్రేజా పేరు మీదకు బదిలి చేసాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *