Breaking News
Home / Film News / నటి భావన ‘వార్’ చిత్రం తాజా కామెంట్…

నటి భావన ‘వార్’ చిత్రం తాజా కామెంట్…

కోడంబాక్కం: సంచలనమైన, చర్చనీయాంశమైన ట్వీటుతో నటి, యాంకర్‌, క్రికెట్‌ కామెంటర్‌ భావన తాజాగా వార్తల్లో నిలిచింది. ఇది కాస్త ఆలస్యమైన వార్తే అయినప్పటికీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఈ అమ్మడు ట్వీటు జోరుగా ప్రచారమవుతోంది. ఈ నెల 5వ తేదీన నటి భావన బాలకృష్ణన్‌ ఓ ట్వీట్‌ చేసింది. హృతిక్‌రోషన్‌ నటించిన ‘వార్‌’ సినిమాకు సంబంధించిన ట్వీట్‌ అది. ‘వార్‌ చిత్రంలో యాక్షన్‌, థ్రిల్లర్‌ అంశాలు, బాలీవుడ్‌ స్థాయి ఫైట్‌ సన్నివేశాలు, ప్రేమ, బైక్‌ రేస్‌లన్నీ ఆకట్టుకుంటున్నాయి. పురుషులను ఆకట్టుకునే విషయాలివి. ఇక అమ్మాయిలను కూడా ఆకర్షిస్తున్న విషయం ఏమిటంటే హృతిక్‌ రోషన్‌, టైగర్‌ షెరాఫ్‌ల నటనే. అందరి హృదయాలను ఇద్దరూ కొల్లగొడుతున్నారు. హృతిక్‌రోషన్‌ ఇలాంటి పలు చిత్రాల్లో నటించాలి. అంతేకాకుండా ఆయన వీర్యదానం చేయాలని’ ఆమె ట్వీట్‌లో కోరారు. ఇప్పుడు ఈ ట్వీట్‌పై పలు రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *