Breaking News
Home / National / శివసేన పార్టీలో చేరిన నటి దీపాలీ….

శివసేన పార్టీలో చేరిన నటి దీపాలీ….

మహారాష్ట్ర : మహారాష్ట్రలోని రాజకీయ పార్టీల్లో సినీ గ్లామర్ పెరుగుతోంది. గత పార్లమెంటు ఎన్నికల సమయంలోనే పలువురు నటులు రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ మరాఠీ నటి దీపాలీ సయ్యద్ శివసేనలో చేరారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, ఆయన కుమారుడు ఆదిత్య థాకరేల సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దీపాలీకి పార్టీ జెండాను, సభ్యత్వాన్ని ఉద్ధవ్ థాకరే అందించారు. అనంతరం దీపాలీ మాట్లాడుతూ, తాను ముంబ్రా కల్వ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్టు తెలిపారు. అక్టోబర్ 21న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *