Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపీ సీఎం భార్యతో సినీ నటి నమ్రత భేటీ….

ఏపీ సీఎం భార్యతో సినీ నటి నమ్రత భేటీ….

అమరావతి: ఏపీ సీఎం జగన్ భార్య వైఎస్‌ భారతితో, సినీ నటుడు మహేష్‌బాబు సతీమణి నమ్రత భేటీ అయ్యారు. తెనాలి సమీపంలోని బుర్రిపాలెం గ్రామాన్ని మహేష్‌బాబు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ గ్రామంలో అభివృద్ధి పనులకు నమ్రత ప్రభుత్వ సహకారం కోరినట్లు తెలిసింది. ‘గ్రామం ఫౌండేషన్’ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు నమ్రత భారతికి వివరించారు.

మహేష్ బాబు తండ్రి, సినీ నటుడు కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెం. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్ బాబు ఇప్పటికే పలు అభివృద్ధి పనులు పూర్తి చేయించారు. కొత్తగా కొన్నింటికి శ్రీకారం చుట్టడంతో ఆ అభివృద్ధి బాధ్యతలను నమ్రత చూసుకుంటున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *