ఫిల్మ్ న్యూస్: ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతగానో రాణించిన హన్సిక ప్రస్తుతం చాలా డల్ అయింది. ఈ అమ్మడికి తెలుగులో ఒక్క అవకాశం కూడా రావడం లేదు. దాదాపు దశాబ్ధ కాలంగా తన గ్లామర్‌తో అలరిస్తూ వస్తున్న హన్సిక కెరీర్లో 50 సినిమాలు చేసింది. అయితే ఈ అమ్మడు కోలీవుడ్ స్టార్ హీరోస్ సరసన నిలిచి హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్‌లో ధనుష్, విజయ్, శంకర్, కలపతి అఘోరాం వంటి వారు మాత్రమే రోల్స్ రాయ్స్ లగ్జరీ కారు వాడుతున్నారు. తాజాగా హన్సిక తల్లి డాక్టర్ మోనా హన్సికకి రోల్స్ రాయ్స్ ఫాంటమ్ 8 సిరీస్‌ని దీపావళి గిఫ్ట్‌గా ఇచ్చారట. దీని ధర 12 కోట్ల పై మాటే అంటున్నారు. లగ్జరీ కారు విషయంలో హన్సిక స్టార్ హీరోల సరసన నిలవడాన్ని ఆమె అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు .
