అడిలైడ్: నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసి ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన రోహిత్.. లియాన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. మరో ఎండ్‌లో పుజారా మాత్రం జిడ్డాట ఆడుతూ వికెట్ పడకుండా జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం భారత్ 40 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. పుజారా 23, పంత్ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
అంతకుముందు.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన మురళీ విజయ్ 11 పరుగులు మాత్రమే చేసి, స్టార్క్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ కూడా నిరాశ పరిచాడు. కేవలం రెండు పరుగులే చేసిన రాహుల్‌ను హజెల్‌వుడ్ పెవిలియన్‌కు పంపాడు. ఇక భారీ అంచనాలున్న భారత కెప్టెన్ కోహ్లీ కూడా మూడు పరుగులకే అవుటయ్యాడు. పాట్ కమ్మిన్స్ అతడిని అవుట్ చేశాడు. ఇక వైస్ కెప్టెన్ కూడా 13 పరుగులు మాత్రమే చేసి హజెల్వుడ్కే చిక్కాడు.