Breaking News
Home / National / బీజేపీలో చేరిన టీడీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు….

బీజేపీలో చేరిన టీడీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు….

ఢిల్లీ: సోమవారం ఏపీ మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత ఆదినారాయణరెడ్డి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సమక్షంలో బీజేపీలోకి చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధి ప్రాంతీయ పార్టీలతో సాధ్యంకాదన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పేదొకటి చేసేదొకటి అని విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధానిగా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని, ‘రివర్స్ టెండరింగ్‌ను అందరూ వ్యతిరేకించినా జగన్ మొండిగా ముందుకెళ్లారని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం తప్పనిసరన్నారు. బీజేపీ బలోపేతానికి కృషి చేస్తాను’ అని ఆయన చెప్పుకొచ్చారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *