Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపీలో భూముల అమ్మకంపై విచారణ వాయిదా…

ఏపీలో భూముల అమ్మకంపై విచారణ వాయిదా…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ భూముల అమ్మకంపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ భూములను లాక్‌డౌన్‌ సమయంలో ఈ-వేలం ద్వారా విక్రయించడం తగదని గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త సురేశ్‌బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్‌ తరపున న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. ”ప్రభుత్వం ఆస్తులను అమ్ముకోవటం భావ్యమా?.. అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఆదాయం కోసం ఇతర మార్గాలను అన్వేషించాలి కానీ, ఉన్న ఆస్తులను ఆమ్ముకోవడం ఏమిటి?. ఓవైపు ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోలు చేస్తున్నారు.. మరో వైపు ఉన్న భూములను అమ్మకుంటున్నారు. ఇదేం పరిస్థితి” అని హైకోర్టు ఆక్షేపించిందని న్యాయవాది శ్రీనివాసరావు తెలిపారు. కోర్టు తీర్పు పరిధిలోనే 28 నుంచి జరగనున్న ఈ-వేలం ఉండాలని హైకోర్టు ఆదేశించింది. కౌంటరు దాఖలుకు‌ గడువు కోరడంతో విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *