Breaking News
Home / Crime / వ్యభిచారం సాగిస్తున్న ముఠా అరెస్ట్….

వ్యభిచారం సాగిస్తున్న ముఠా అరెస్ట్….

ఘజియాబాద్ : వాట్సాప్‌లో విటులకు అమ్మాయిల ఫోటోలు పంపించి వారిని ఆకర్షించి స్పాల మాటున వ్యభిచారం సాగిస్తున్న ముఠాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అందిన రహస్య సమాచారం మేర ఘజియాబాద్ నగరంలోని రాజ్ హంస ప్లాజాలోని మూడు స్పా సెంటర్లపై ఆకస్మిక దాడులు చేసి 9 మంది మహిళలతో సహా 19 మందిని అరెస్టు చేశారు. వాట్సాప్ ద్వారా నగరంలోని విటులకు మహిళల ఫోటోలు పంపించి వారిని ఆకర్షించి గుట్టుగా స్పాలలోనే వ్యభిచారం సాగిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యభిచార రాకెట్ నిర్వహిస్తున్న కీలక మహిళను అరెస్టు చేశామని అసిస్టెంట్ పోలీసు  కేశవ్ కుమార్ చెప్పారు. 16 వేల నగదు, 24 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *