Breaking News
Home / Film News / అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేశా….

అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేశా….

ఫిలిం న్యూస్:ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లు తమపై జరిగిన లైంగిక వేధింపులు, దాడుల గురించి చెప్పారు. తాజాగా నటి మంజరి ఫడ్నీస్‌ తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందని.. దానికి ఎంతో మంది అమ్మాయిలు బలవుతున్నారని ఆరోపించింది. పడక సుఖం అందిస్తే తప్ప అవకాశాలు రావంటూ తీవ్రంగా స్పందించింది.తన కెరీర్‌లో చాలా వరకు చిన్న సినిమాల్లోనే నటించడానికి కారణం తను అలాంటి పనులు చేయననడమే అంటూ చెప్పుకొచ్చింది. తన సినిమాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడం, కాస్టింగ్ కౌచ్ వంటి విషయాల వలన చాలా కాలం డిప్రెషన్‌లో ఉండిపోయనంటోంది. కాస్టింగ్ కౌచ్ విషయంలో ఆత్మాభిమానాన్ని కోల్పోలేక ఎందరో నిర్మాతల సినిమాలను రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది. కొన్ని సార్లు సినిమాకి సైన్ చేసిన తరువాత కోరికలు తీర్చమని అడిగేవారని.. దీంతో అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బుని తిరిగిచ్చేసి సినిమాల నుండి తప్పుకున్నట్లు తెలిపింది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *