Breaking News
Home / National / మూడేళ్ల తర్వాత మళ్లీ విండీస్ కోచ్‌గా….

మూడేళ్ల తర్వాత మళ్లీ విండీస్ కోచ్‌గా….

ఢిల్లీ: వెస్టిండీస్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా ఫిల్ సిమన్స్ మళ్లీ నియమితులయ్యాడు. మూడేళ్ల విరామం తర్వాత వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మళ్లీ సిమన్స్‌కే జట్టు పగ్గాలు అప్పగించింది. నాలుగేళ్ల పాటు సిమన్స్ కరీబియన్ టీమ్ హెడ్‌కోచ్‌గా కొనసాగుతారని విండీస్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. 2016 టీ20 వరల్డ్‌కప్ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించారు. జట్టు, బోర్డులో విభేదాలు రావడంతో మాజీ విండీస్ ఆల్‌రౌండర్ సిమన్స్(56) 2016 సెప్టెంబర్‌లో పదవి నుంచి తప్పుకున్నాడు. టీ20 క్రికెట్లో జట్టును విజయవంతంగా నడిపించిన సిమన్స్ టెస్టుల్లో చెప్పుకోదగ్గస్థాయిలో మార్గనిర్దేశనం చేయలేకపోయాడు. అతడు కోచ్‌గా ఉన్న సమయంలో విండీస్ 14 టెస్టుల్లో కేవలం ఒక్క టెస్టులోనే గెలుపొందింది. 2017లో అఫ్గనిస్థాన్ జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. 2002లో క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాక 2004లో జింబాబ్వే జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. ఐర్లాండ్ కోచ్‌గానూ సిమన్స్ సేవలందించాడు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *