Breaking News
Home / Lifestyle / Business / ఎయిర్‌ ఏషియా బంపర్‌ ఆఫర్‌

ఎయిర్‌ ఏషియా బంపర్‌ ఆఫర్‌

రూ.999కే దేశీయ మార్గాల్లో టికెట్లు
ముంబై: విమానయాన సేవల సంస్థ ఎయిర్‌ ఏషియా ఇండియా భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా విదేశీ విమానయాన టికెట్‌ చార్జీల కనీస ధరను రూ.1,399గా నిర్ణయించింది. దేశీయ మార్గాల్లో టికెట్‌ రేటు రూ.999 నుంచి మొదలవుతుంది. ఈ 8 రోజుల పరిమితకాల ఆఫర్‌ శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమవుతుందని సంస్థ ప్రకటించింది.

ఈ ఆఫర్‌లో కొనుగోలు చేసిన టికెట్ల ద్వారా వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి నవంబరు 26 మధ్యకాలంలో ప్రయాణించేందుకు వీలుంటుంది. ఎయిర్‌ ఏషియా ఇండియాతోపాటు ఈ గ్రూపునకు చెందిన ఎయిర్‌ ఏషియా బెర్హాద్‌, థాయ్‌ ఎయిర్‌ ఏషియా, ఎయిర్‌ ఏషియా ఎక్స్‌ విమానాల్లో ప్రయాణానికీ ఈ ఆఫర్‌ వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

ఎయిర్‌ ఏషియా డాట్‌ కామ్‌తోపాటు ఎయిర్‌ ఏషియా మొబైల్‌ యాప్‌ ద్వారా టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. అంతర్జాతీయ మార్గాల్లో కౌలాలంపూర్‌, బ్యాంకాక్‌, క్రాబీ, సిడ్నీ, అక్లాండ్‌, మెల్‌బోర్న్‌, సింగపూర్‌, బాలీతోపాటు ఇతర నగరాలకు ఈ డిస్కౌంట్‌ వర్తిస్తుంది. భారత్‌ విషయానికొ

Check Also

సభలో కలతచెందిన సోనియాగాంధీ

Share this on WhatsAppన్యూఢిల్లీ: రాఫెల్ డీల్‌పై దేశాన్ని తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *