Breaking News
Home / World News / గాల్లో విమానం; టాయ్‌లెట్‌లో ఇరుక్కుపోయిన మహిళ….?

గాల్లో విమానం; టాయ్‌లెట్‌లో ఇరుక్కుపోయిన మహిళ….?

వాషింగ్టన్: విమానంలోని టాయ్‌లెట్ లో ఓ ప్రయాణికురాలు ఇరుక్కపోవడంతో..పైలట్ అత్యవసరంగా విమానాన్ని దింపేయాల్సి వచ్చింది. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి వాషింగ్టన్ వెళుతున్న యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో బుధవారం ఈ ఘటన జరిగింది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికురాలు బాత్రూమ్‌లోకి వెళ్లింది. కానీ బయటకు వద్దామనుకుంటే తలుపు తెరుచుకోలేదు. విమానం సిబ్బంది చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో వారు విమానం కెప్టెన్‌కు సమాచారం అందించారు. వెంటనే సదరు పైలట్ విమానాన్ని సమీపంలో ఉన్న డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దింపేశారు.

ఎయిర్‌పోర్టులోని అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మహిళను టాయిలెట్‌లోంచి బయటకు తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో మహిళకు ఎటువంటి హానీ కలగలేదు. కాగా..ప్రయాణికులకు అసౌకర్యం కలగడంతో విమానయాన సంస్థ వారికి క్షమాపణలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు ట్విటర్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *