Breaking News
Home / Lifestyle / Business / కొత్త ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌టెల్

కొత్త ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌టెల్

న్యూఢిల్లీ: తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు భారతీఎయిర్‌టెల్ మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లు ఎంపిక చేసుకున్న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో 1టీబీ బోనస్ డేటాను ఆఫర్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
వినియోగదారులు ఎంపిక చేసుకున్న సర్కిళ్లలో రూ. 799 ప్లాన్‌తో 500జీబీ బోనస్ లభిస్తోందని సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. రూ. 999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో నెలకు 100ఎంబీపీఎస్ వేగంతో 250జీబీ డేటా ఇవ్వనున్నారు. బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ రూ. 1,999తో 1000జీబీ లేదా 1టీబీ బోనస్ డేటాను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Check Also

ఎంజీ హెక్టార్ కారు విడుదల

Share this on WhatsAppన్యూఢిల్లీ: ఎంజీ మోటార్స్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో మరో కారును మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *