Breaking News
Home / Film News / భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం….

భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం….

ముంబయి: భవిష్యత్తును ముందుగానే ఊహించలేమంటున్నారు బాలీవుడ్‌ తార ఐశ్వర్యరాయ్‌. ఆమె వెండితెరపై సందడి చేసి దాదాపు ఏడాది కావొస్తోంది. ఈ నెల 18న ఆమె స్వరం అందించిన హాలీవుడ్‌ సినిమా ‘మాలిఫిసెంట్‌: మిస్ట్రస్‌ ఆఫ్‌ ఈవిల్‌’ విడుదల కాబోతోంది. ఇందులో హాలీవుడ్‌ అందాల భామ ఏంజెలీనా జోలీ పాత్రకు ఐశ్వర్య హిందీలో డబ్బింగ్‌ చెప్పారు. ఐదేళ్ల క్రితం వచ్చిన ‘మాలిఫిసెంట్‌’కు సీక్వెల్‌ ఇది. వాల్ట్‌ డిస్నీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జోచిమ్‌ రోనింగ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఐశ్వర్య మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో కుమార్తె ఆరాధ్యతో కలిసి నటించడం గురించి ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి ఐశ్వర్య స్పందిస్తూ ‘జీవితం నా కోసం, ఆరాధ్య కోసం ఏం దాచుందో నాకు తెలియదు. కాబట్టి ఈ క్షణాన్ని ఇలా స్వీకరిద్దాం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం’ అని అన్నారు.

అనంతరం ‘మాలిఫిసెంట్‌’ సీక్వెల్‌లో ఏంజెలీనా జోలీకి స్వరం ఇవ్వడం గురించి ఐశ్వర్య ముచ్చటించారు. ఇటీవల ఆరాధ్యతో కలిసి తొలి భాగాన్ని చూశానని, నచ్చిందని అన్నారు. ‘నా కుమార్తెకు సినిమా నచ్చింది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *