న్యూఢిల్లీ: భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించనున్నారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కాశ్మీర్ విషయంలో చైనా, మలేషియా, టర్కీ దేశాలను కోరినట్లుగానే సౌదీ అరేబియాను మద్దతు కోరారు. అయితే కాశ్మీర్ అంశంపై వాస్తవ పరిస్థితిని వివరించేందుకు అజిత్ దోవల్ సౌదీ రాజధాని రియాద్‌కు వెళ్లారు. కాశ్మీర్ విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాలు అంతగా స్పందించలేదు. సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై జరిగిన దాడులతో ప్రపంచ మార్కెట్లో ఇంధనం కొరత ఏర్పడింది. భారత్‌కు సౌదీతో ఆయిల్ కొనుగోలుతో పాటు సత్సంబంధాలున్నాయి.
