Breaking News
Home / Film News / మరో సాహసానికి సిద్ధమైన అజిత్….

మరో సాహసానికి సిద్ధమైన అజిత్….

కోడంబాక్కం: నటన మాత్రమే కాకుండా ఎన్నెన్నో ప్రత్యేకతలు కలిగిన నటుడు అజిత్‌. కారు రేసర్‌, చిన్నపాటి విమానాల రూపకల్పన, ఫొటోగ్రఫీ.. ఇలా పలు రంగాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాకుండా పైలెట్‌ లైసెన్స్‌ కూడా ఆయనకు ఉండటం విశేషం. చెన్నై ఐఐటీలోని ఏరోనాటికల్‌ స్పేస్‌ సెంటర్‌ దక్ష బృందానికి సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా అజిత్‌ బృందం రూపొందించిన చిన్న విమానం విజయవంతంగా ఆకాశంలో ఎగిరి ప్రపంచంలోనే రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. అజిత్ ఇప్పుడు మరో సాహసానికి సిద్ధమయ్యారు. రైఫిల్‌ షూటింగ్‌లో కూడా ప్రత్యేకతను చాటుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఇటీవల కోవైలో జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ పోటీల్లో చెన్నై రైఫిల్‌ క్లబ్‌ తరఫున పాల్గొని 400కుగాను 314 పాయింట్లు పొంది తదుపరి స్టేజీకి అర్హత సాధించారు. తద్వారా డిసెంబరులో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగే జాతీయ స్థాయి షూటింగ్‌ పోటీలో ఆయన పాల్గొననున్నారు.

Check Also

‘శాటిలైట్‌ శంకర్‌’ మూవీ ట్రైలర్ విడుదల….

Share this on WhatsAppఫిల్మ్ న్యూస్: సూరజ్‌ పంచోలి కథానాయకుడిగా ఇర్ఫాన్‌ కమల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాటిలైట్‌ శంకర్‌’. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *