Breaking News
Home / Film News / అజిత్‌ కొత్త చిత్రం షూటింగ్‌ ప్రారంభం

అజిత్‌ కొత్త చిత్రం షూటింగ్‌ ప్రారంభం

‘వీరం’, ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’.. ఇలా ‘వి’ అక్షరంతో మొదలయ్యే పదాలనే టైటిల్స్‌గా పెట్టుకుంటున్న అజిత్‌ తన కొత్త చిత్రానికి కూడా అదే సెంటిమెంట్‌నే కొనసాగించారు. ‘నేర్‌కొండ పార్వై’ దర్శక, నిర్మాతలతోనే అజిత్‌ 60వ చిత్రం తెరకెక్కుతోంది. ఆ చిత్రానికి ‘వలిమై’ అని టైటిల్‌ పెట్టారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ నిర్మిస్తుండగా, ‘ధీరన్‌ అధిగారం ఒండ్రు’ ఫేమ్‌ హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పటిలాగే అజిత్‌ లేకుండానే ‘వలిమై’ పూజా కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా దివంగత నటి శ్రీదేవికి చిత్రబృందం నివాళులర్పించింది. ‘వలిమై’లో అజిత్‌ యంగ్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, అజిత్‌ని కొత్తగా చూపించేందుకు దర్శకుడు వినోద్‌ కసరత్తులు చేస్తున్నారు. హీరోయిన్‌, ఇతర తారాగణాన్ని త్వరలో ప్రకటించనున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *