Breaking News
Home / Film News / ఆ దర్శకుడితో అజిత్ సినిమా లేనట్టే….

ఆ దర్శకుడితో అజిత్ సినిమా లేనట్టే….

ఫిల్మ్ న్యూస్: అజిత్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. వైవిధ్యభరితమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఆయన 60వ చిత్రంగా ‘వలిమై’ రూపొందుతోంది. వినోత్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అజిత్ 61వ సినిమా .. మురుగదాస్ తో వుండనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాంతో అజిత్ అభిమానులంతా ఆనందంతో పొంగిపోయారు. 2001లో అజిత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ‘ధీనా’ అనే సినిమా చేశాడు. మళ్లీ ఇంత కాలానికి ఈ ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళుతున్నారని అనుకున్నారు. కానీ అజిత్ 61వ సినిమా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందనుందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. దాంతో మురుగదాస్ తో అజిత్ మూవీ లేనట్టేనని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం మురుగదాస్ ‘దర్బార్’ సినిమా పనులతో బిజీగా ఉన్నాడనే విషయం తెలిసిందే.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *